ఆయన వయసు 77 ఏళ్ళు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో పని చేస్తూ ఇటీవల ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి చదువుకు వయసుతో పనిలేదు అని నిరూపించారు. లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఎస్ లక్ష్మీనరసింహ శాస్త్రి ఈవంతను సాధించారు. కార్యనిర్వాహక ఇంజనీరింగ్ గతంలో పదవి విరమణ పొందిన ఆయనను అనంతరం కూడా కొనసాగిస్తున్నారు.
ఓవైపు విధులు నిర్వహిస్తూనే అక్కడే ఎమ్మెస్ పూర్తి చేశారు పరిశోధన పత్రాన్ని సమర్పించి జూలై నెలలో పట్టా అందుకున్నారు. త్రిబుల్ ఐటీ ఆలోచన నుంచి ప్రారంభం వరకు శాస్త్రి ఇంజనీరింగ్ గా విధులు నిర్వహించారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన భవనాలు ప్రయోగశాల నిర్మించడంలో కీలకపాత్ర పోషించారని ప్రశంసిస్తూ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అధికారులు బుధవారం ప్రకటనలో విడుదల చేశారు. విజయవాడలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన ఆయన విజయవాడ కర్నూల్లో విధులు నిర్వహించాక హైదరాబాద్కు వచ్చారు.
1998లో ఉమ్మడి ఏబిసిఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు త్రిబుల్ ఐటీ నిర్మాణ బాధ్యతను చేపట్టారు ట్రిపుల్ ఐటి హైదరాబాద్ చిహ్నంలో మర్రిచెట్టు ఉండాలని శాస్త్రి ప్రతిపాదించాడు. వీధుల్లో ఉంటూనే మరింత చదవాలన్న ఆసక్తితో రెండు ఏళ్ల క్రితం మాస్టర్స్ డిగ్రీలో చేరి ఉత్తీర్ణులయ్యారు.