హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థకు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 3000 పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసిహెచ్ఎండిఏ జలమండలిలో అదనంగా ఉన్న పోస్టులను కొన్నింటిని హైడ్రాక్ కు కేటాయించనున్నారు.
ఇంకా అవసరమైన పోస్టులను నీరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలని అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలని విషయమై త్వరలో మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారని తెలుస్తుంది. హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామపంచాయతీల పరిధిలోని చెరువులు నీటి వనరులు ప్రభుత్వ భూములను ఈ సంస్థ పరిరక్షించాలని అనేది ప్రభుత్వ లక్ష్యం.