ఈరోజు CPGET ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో లో గల 8 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్-CPGET) ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల అవుతాయి.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఓయూ రిజిస్ట్రార్ పి లక్ష్మినారాయణ హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో కాలేజీలలో కలిపి 45 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు గతనెల ఆరు నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రాతపరీక్షలను నిర్వహించారు. దీనికిగాను 73,342 మంది దరఖాస్తు చేయగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. సుమారు 40,000 సీట్లకు త్వరలోనే కౌన్సిలింగ్ ఉంటుంది.
ఫలితాల విడుదల కాగానే, తొందరలోనే విద్యార్థులకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి విద్యార్థులు, 1. డిగ్రీ tc, memo సర్టిఫికెట్లు, 2. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు, 3. పదవ తరగతి సర్టిఫికెట్లు, 4. ఈ సంవత్సరంలో తీసిన ఇన్కమ్ సర్టిఫికెట్, 5. కులం సర్టిఫికెట్, 6. ఇతర సర్టిఫికెట్లు, సిద్ధం చేసుకోవలసి ఉంటుంది.
Results Link 👇👇👇👇