రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి 2025 26 కనీసం అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ కూడా ఇవ్వనందున ఇప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టవద్దని ప్రైవేటు జూనియర్ కళాశాలలను ఇంటర్ బోర్డు ఆదేశించింది.అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కళాశాలలకు అఫిలేషన్ ఇచ్చిన తర్వాత గుర్తింపు పొందిన కాలేజీల వివరణలను వెబ్సైట్లో ఉంచుతామని ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన తర్వాత వాటిలో మాత్రమే చేరాలని విద్యార్థులు తల్లిదండ్రులకు సూచించింది. కళాశాలలో పిఆర్ఓ లను నియమించుకొని ఇప్పుడే ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంల ఇంటర్ బోర్డు తాజా ప్రకటన జారీ చేసింది.