కళాశాల విద్యార్థులకు అపార్ ఐడి. జూన్ నాటికి ప్రక్రియ పూర్తి చేయాలి.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాభ్యసించే విద్యార్థులందరికీ అపార్ ఐడి అందించాలని ఇటీవల కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా అన్ని వర్సిటీలు కళాశాలల యాజమాన్యాలను ఆదేశాలు జారీ చేసింది.
12 వర్సిటీలు ఉపకులపతులతో కాన్ఫరెన్స్ :
ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా కేంద్ర విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణ రెడ్డి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని 12 వర్సిటీల ఉపకులపతులు రిజిస్టార్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.
అపర్ ఐడి తీసుకున్న విద్యార్థి ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలో తాము పొందిన క్రెడిట్లను అకాడమీకి బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ లో దాచుకోవచ్చు.
ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఒక వర్సిటీ నుంచి మరొక వర్సిటీకి మారిన క్రెడిట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలపై విద్యార్థులను అవగాహన కల్పించాలి. వచ్చే జూన్ నాటికి ప్రతి విద్యార్థికి అప్పర్ ఐడి ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.