గవర్నర్లను కోరిన ప్రధాని మోదీ
రాష్ట్రపతి మురము అధ్యక్షతన ప్రారంభమైన గవర్నర్ల సదస్సుకేంద్రం,రాష్ట్రాల మధ్య సరియైన వారదులుగా నిలవాలని గవర్నర్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. సామాజిక సంస్థలు ప్రజలతో సంభాషించాలని అణగారిన వర్గాల వారిని కలుపుకొని పోయేలా చూడాలని సూచించారు.
రాష్ట్రపతి ద్రౌపది మూర్మో అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో ప్రధాని ఈ మేరకు ప్రసంగించాడు. రాజ్యాంగం పరిధిలో ప్రజల యొక్క సంక్షేమం కోసం పని చేసేందుకు గవర్నర్ పదవి చాలా దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రారంభం చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు మెరుగైన సమన్వయంతో పని చేయడం అవసరము అని చెప్పారు.
ఆయా రాష్ట్రాల్లో సంబంధిత సమన్వయాన్ని పెంపొందించేందుకు మార్గాలు అన్వేషించాలని గవర్నర్లకు పిలుపునిచ్చారు. ఐక్యత భావం మరింత పెరిగేలా చూడాలని అన్నారు కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలు దేశం ఆలోచన ధోరణిలో మార్పునకు సంకేతాలని తెలియజేశారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేలా రూపొందించిన జాతీయ విద్యా విధానం సమర్థంగా అమలయ్యేలా రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల కులపతిల హోదాలో తమ వంతు కృషి చేయాలని గవర్నర్లను కోరారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రజల యొక్క సమ్మిళిత అభివృద్ధి కోసం ఆలోచనలు అందరితో పంచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవహార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు అమ్మ పేరుతో ఒక మొక్క మై భారత్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలియజేశారు. రాష్ట్రపతి జగదీప్ ధాన్కడ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు.
శనివారం కూడా ఈ సదస్సు కొనసాగనుంది ఇందులో భాగంగా గవర్నర్లు ఉప గ్రూపులుగా ఏర్పడి కేంద్రం రాష్ట్రాల సంబంధాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజా సమస్యలు సహా పలు అంశాలపై విస్తృతంగా సమాజంలో జరపనున్నారు.