ఎస్సీ ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా

సుప్రీం తీర్పు న్యాయాన్ని బతికించింది

రిజర్వేషన్ల వ్యవస్థలో రెండో అడుగు

సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్ల వ్యవస్థలో రెండో అడుగు పడబోతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే కొనసాగడంతో లబ్ధి పొందిన కులాలకి పదేపదే రిజర్వేషన్ ఫలాలు అందాయి. ఇకపై అణగారిన వర్గాలకు ఆయా ఫలాలు దక్కుతాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ చంద్ర చౌదరి నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.

వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసేంతవరకు ఏపీ తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టారాదు. సంబంధిత మార్గదర్శకాలు వచ్చాకే నోటిఫికేషన్లు ఇవ్వాలి ప్రవేశాలు పూర్తికాని విద్యాసంస్థల్లోనూ దీన్ని అమలు చేయాలి. సుప్రీం తీర్పును అమలు చేయకుంటే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది.

అందువల్ల ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లను వెనక్కి తీసుకొని వర్గీకరణ ప్రకారం మళ్లీ విడుదల చేయాలి. డేటాను వర్గీకరించాలన్న న్యాయస్థానం ఆదేశాన్ని స్వాగతిస్తున్నాం. ఉషా మహిళా కమిషన్ రామచంద్ర రాజు కమిషన్ లోకూర్ కమిషన్ల డేటాలు ఉన్నాయి.2011 ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు అందుబాటులోనే ఉన్నందున కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదు.

నేను రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి మాకు సహకరించిన వారందరినీ వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు తెలుపుతా, హైదరాబాద్ వెళ్లాక జాతీయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి విజయోత్సవ అభినందన సభలను ఒకేసారి నిర్వహించడం పై నిర్ణయం తీసుకుంటామని మందకృష్ణ మాదిగ గారు తెలిపారు

ReplyForwardAdd reaction

Loading