సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్
బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేన నాయర్
సైన్యంలో వైద్య సేవలు విభాగం డైరెక్టర్ జనరల్ సాధన సక్సేన నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఇంతకుముందు సాయిధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డిజి పదవిని చేపట్టిన తొలి అతివగా కూడా ఆమె పేరిటే రికార్డు ఉంది. నాయర్ పూణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో పట్టభద్రురాలు అయ్యారు.
1985 డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో చేరారు. ఆమె ఫ్యామిలీ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సాధన సక్సేనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ కు చెందిన మొదటి మహిళ. ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ గా కూడా సేవలందించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా వైద్య విద్యపై నియమించిన డాక్టర్ కస్తూరి రంగం కమిటీలో సభ్యురాలిగా నామినేట్ అయ్యారు.