తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీసీ యువతి యువకులకు ఆర్టీసీ సహకారంతో డ్రైవింగ్ కోర్సులో 38 రోజులు (304) గంటలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు తెలిపారు.
హెవీ మోటార్ వెహికల్ లైట్ మోటార్ వెహికల్, శిక్షణ కోసం అభ్యర్థులు సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయాల్లో ఈ నెల 15 నుంచి 31 వరకు దరఖాస్తు అందజేయాలని సూచించారు.
దీనికి విద్యార్హత కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలియజేశారు.
AGE LIMIT:
18 ఏళ్లు దాటి 45 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. దీనికి బీసీ యువతి యువకులు మాత్రమే అర్హులు అవుతారు అని ఆర్టీసీ ఎండి మల్లయ్య గట్టు గారు తెలియజేశారు.