బ్యాంకు ఖాతాలో నామినీ పేరు చేర్చారా?

ఓసారి సరి చూసుకోండి, 

లేనిపక్షంలో ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లో సొమ్ము తీసుకునేందుకు అనేక సమస్యలు .

ఖాతాదారునికి సంబంధించిన నామిని వివరాలు నమోదు కాని కారణంగా వేలమంది ఇలాంటి సమస్యలనే వెదురుకుంటున్నారని బ్యాంకు అధికారి గారు తెలియజేశారు. అవగాహన లేకపోవడంతో చాలామంది ఖాతాదారులు నామిని పేరు ముఖ్యమనే విషయాన్ని గుర్తించడం లేదు.

బ్యాంకు నిబంధనల ప్రకారం నామినీ పేరు నమోదు కాని ఖాతాదారు చనిపోయిన కనిపించకుండా పోయిన సందర్భాల్లో ఆయన భార్య సంతానంలోని అందరూ కలిసి  ఏకాభిప్రాయానికి వచ్చి నామిని ఒక పేరును సూచిస్తూ దరఖాస్తు ఫారంపై సంతకాలు చేయాల్సి ఉంది.

ఆస్తుల వివాదంలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఆ సొమ్ము తనకు చెందాలంటే కాదు తనకే చెందాలంటూ పోటీ పడడం ఇలా అనేక కారణాలతో ఇలా అవ్వడానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. ఈ కారణంగా బ్యాంకులు ఖాతాలోని సొమ్ము లాకర్లోని నగలు లేదా ఇతర స్థాస్తులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఖాతాలకు మళ్ళిస్తున్నాయి అని బ్యాంకు అధికారులు సవివరంగా తెలియజేశారు. వివిధ బ్యాంకుల పరిధిలో నామినీ పేరు నమోదు కాని ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ ఇప్పటికే గుర్తించింది. ఇకపై నామిని పేరు నమోదుపై శ్రద్ధ పెట్టాలని ఇటీవల అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై ప్రతి బ్యాంకు శాఖ పరిధి పాలకమండలిలోని వినియోగదారుల సేవా కమిటీ అన్ని ఖాతాలు ఎఫ్డి లాకర్ ఖాతాల వివరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొంది. నామినీల వివరాల నమోదుపై నివేదికను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి మూడు నెలలకోసారి ఆర్.బి.ఐ ఏర్పాటు చేసిన దక్ష పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆర్బిఐ గవర్నమెంటు ఆదేశాలు ఇచ్చింది .

ఇటీవల హైదరాబాద్ లోని ఒక బ్యాంకులో ఖాతా ఉన్న ఖాతాదారుడు కన్నుమూశాడు. అతని పొదుపు ఖాతాల్లో లక్షకు పైగా సొమ్ము ఎఫ్డిలో 50వేల రూపాయలు ఉన్నాయి .ఎన్నో ఏళ్ల క్రితం ఖాతా తెరిచినందున నామిని పేరు నమోదు కాలేదు.

దీంతో సంబంధిత సొమ్ము ఇవ్వాలంటే కుటుంబ సభ్యులంతా సంతకాలు చేయడంతో పాటు ఒకరి పేర్లు నామినీ గా సూచించాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. కానీ మరణించిన వ్యక్తి కుమార్తె కుమారుడు విదేశాల్లో ఉండడం వారి మధ్య సఖ్యత లేనందున కలిసి సంతకాలు చేసి ఒకరి పేరును సూచించలేదు.

దీంతో బ్యాంకు ఆశ్రమను ఎవరికి ఇవ్వలేకపోయింది. మరో ఉదాంతం ఖాతాదారుడు మరణించారు నామినీ పేరు నమోదు కాలేదు. లాకర్ ఖాతా తెరిచేందుకు కుటుంబాల సభ్యులు ఎల్లగా బ్యాంకు సిబ్బంది అభ్యంతరం తెలిపారు. కోర్టు నుంచి వారసుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటేనే అనుమతిస్తామని సూచించడంతో వారు కూడా పాపం చాలా బాధపడ్డారు అని బ్యాంకు బ్యాంకు అధికారి తెలియజేశారు.

Loading