రక్షణ రంగ ఉత్పత్తుల విజ్ఞాన్ వైభవం ప్రోగ్రాం మార్చ్ 1st nd 2nd తేదీన సాధారణ ప్రజలు సందర్శించవచ్చు.

రక్షణ రంగా ఉత్పత్తుల విజ్ఞాన్ వైభవం 

నేటి నుంచి గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రదర్శన 

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్ డి ఓ ఏరోనాటికల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా కలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్లెంట్ సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన్ వైభవం 2కె 25 పేరిట రక్షణ రంగా ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారని తెలిపారు,

హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనను శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజు నాథ్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు .

మూడు రోజులపాటు కొనసాగేటటువంటి ఈ ప్రదర్శనలో దాదాపు 200 స్టార్లు ఏర్పాటు చేస్తున్నట్లు డిఆర్డిఓ వారు తెలిపారు .

పాఠశాలలు ఇంజనీరింగ్ విద్యార్థులతో పటు దాదాపు 30000 మంది ఈ ప్రదర్శన తిలకించేందుకు ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు ఆల్రెడీ నిర్వాహకులు తెలిపారు ముందుగా పేర్లను నమోదు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.

యుద్ధ పరికరాల పనితీరు వారి తయారీ పరిజ్ఞానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.ఒకటి , రెండు తేదీల్లో సాధారణ ప్రజలు సందర్శించవచ్చు.

డిఫెన్స్ టెక్నాలజీ పరిజ్ఞానంతో పాటు ఈ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డిఆర్డిఓ మిస్సైల్ స్ట్రాటజిక్ సిస్టం డైరెక్టర్ జనరల్ ఇన్ రాజబాబు డి ఆర్ డి ఎల్ డైరెక్టర్ జి ఏ శ్రీనివాసమూర్తి గారు మీడియాకు సవివరంగా తెలియజేశారు.

Loading