ఎప్ సెట్ నోటిఫికేషన్ జారీ

pasupula sravanthi <[email protected]>12:51 (10 minutes ago)
to me

25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ 

వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చిన జేఎన్ టీ యూహెచ్ 

బిటెక్ బయో మెడికల్ ఫార్మసిటికల్ ఎంపీసీ విద్యార్థులకు 50 శాతం సీట్లు 

స్థానిక స్థానికేతర  కోటాపై ప్రవేశాల నాటికి నిర్ణయం 

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025- 26) లో ఇంజనీరింగ్ ఫార్మా డీఎస్సీ అగ్రికల్చరల్ వెటర్నరీ సైన్స్ తదితర పలు కోర్సుల్లో ప్రవేశానికి ఎఫ్ సెట్ (EAP -cet) నోటిఫికేషన్  గురువారం విడుదల చేయడం జరిగింది.

ఈనెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం జేఎన్టీయూహెచ్ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది.

ఆయా కోర్సులకు అర్హత ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నాటికి ప్రభుత్వం జారీ చేసే జీవోలే ఆధారమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

స్థానిక స్థానికేతర కేటగిరి పైన 1994 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 తదితర అంశాలపై ప్రవేశాల నాటికి ఉన్న నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేశారు.

సిలబస్ కోర్సులు తదితర పూర్తి వివరాలను వెబ్ సైట్ లో పొందపరచడం జరిగింది. 

ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలు ఏప్రిల్ 29 30 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే రెండు నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. 

ముఖ్యాంశాలు 

బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో చేరాలంటే ఎఫ్జెడ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్ష రాయడం తప్పనిసరి. 

బీఫార్మసీ ఫార్మా డి తో పాటు బీటెక్ బయో మెడికల్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ సీట్లను ఎంపీసీ బైపీసీ గ్రూపు విద్యార్థులకు చెరి సగం కేటాయిస్తారు. 

బయో మెడికల్ ఫార్మసిటికల్ కోర్సులు గతే గత ఏడాది కూడా ఉన్న వీటిలో సగం సీట్లు ఎంపీసీ విద్యార్థులకు ఇస్తారని ఈసారి నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. 

ఇంజనీరింగ్ ఇతర కోర్సుల్లో ప్రవేశానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇంటర్లో 40% ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. 

ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో చేరాలంటే 2025 డిసెంబర్ 31 నాటికి 16 సంవత్సరాలు నిండాలి. గరిష్ట వయోపరిమితి లేదు అయితే బిటెక్ డైరీ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ హాల్టికల్చరల్ కు 17 ఏళ్లు నిండి ఉండాలి. 

ఈ కోర్సుల్లో చేరేందుకు ఎస్సీ ఎస్టీలకు 25 ఇతను ఇతరులకు 22 సంవత్సరాలు గరిష్ట వైయపరమతిగా నిర్ణయించారు. 

2500 రూపాయలు 5000 రూపాయల ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసే వారికి హైదరాబాద్ జూన్ ఫోర్ లో మాత్రమే పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. 

ఏపీలో విజయవాడ కర్నూల్ లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

https://eapcet.tgche.ac.in/TGEAPCET/Courses.aspx

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *