మనలో ఎక్కువ మంది కాఫీ కంటే టీ తాగడానికి ఇష్టపడతాం. చాయ్ మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. పొద్దున్నే రెండు గుట్కాలు పడితేనే హాయిగా ఉంటుంది. ఇక అక్కడ నుంచి చిన్నచిన్న విరామాలతో రోజులు ఎన్ని కప్పులు సేవిస్తాము.
లెక్కే ఉండదు నిజానికి టి కంటే బ్లాక్ కాఫీ మంచిదని సర్వేలు తెలియజేస్తున్నాయి. తరచూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీలో వేసే పాలు పంచదారలు హానిచేస్తాయి పౌడర్ కూడా ఎక్కువ పడుతుంది. బ్లాక్ కాఫీ అలా కాదు చిటికెడు పొడి వేస్తే సరిపోతుంది. ఆ రుచి వాసన హుషారును తేటదనాన్ని ఇస్తాయి
కాఫీ తాగడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది.
నరాల వ్యవస్థ సవ్యంగా ఉంటుంది.
ఏకాగ్రత నిలుస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
సమస్యల్ని పరిష్కరించే చురుకుదనం నైపుణ్యం తెలివితేటలు అలవాటుతాయి.
కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
బ్లాక్ కాఫీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
బ్లాక్ కాఫీ వ్యాయామం చేసేముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే నీరసం లేకుండా శక్తి ఉత్సాహం ఏర్పడతాయి.