గురుకులాల్లో ఐదో తరగతికి తగ్గిన దరఖాస్తులు
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే ఐదో తరగతి ప్రవేశా పరీక్షకు దరఖాస్తులు భారీగా తగ్గాయి.2025 26 విద్యా సంవత్సరానికి కేవలం 79 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
దీంతో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 41 వేల వరకు దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ సొసైటీల పరిధిలోని 643 గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 51 వేయి 924 సీట్లు అందుబాటు లో ఉన్నాయి.
అయితే 2025 సేటుకు గత డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఎస్సీ గురుకుల సొసైటీ దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు కుల ఆదాయ దృవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేసింది.
విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు కలెక్టరేట్ల లోను ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ అవి సకాలంలో రాకపోవడం పలు ఇబ్బందుల కారణంగా దరఖాస్తు చేయలేకపోయారని సమాచారం తెలిసింది.