జస్టిస్ జెఎస్ వర్మ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ అందుకున్న 24 ఏళ్ల తెలుగు కుర్రాడు

జస్టిస్ జెఎస్ వర్మ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ అందుకున్న 24 ఏళ్ల తెలుగు కుర్రాడు యువ లాయర్ ఏచూరి శ్రీకర్ .

మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మ పేరు మీదుగా ఏర్పాటైన ఫెలోషిప్నకు దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. యువ లాయర్ల నుంచి సీనియర్ల దాకా అంతా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. రెండు నుంచి మూడేళ్ల సీనియారిటీ ఉన్నవాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

కానీ న్యాయవిద్య మీద ఉన్న ప్రేమ న్యాయవాద వృత్తి మీద ఉన్న అభిమానం సబ్జెక్టు పై ఉన్న పట్టు తెలుసుకొనేలా ఓ పరీక్ష నిర్వహిస్తారు .దాంట్లో  మంచి ప్రతిభ చూపిస్తే తర్వాత ముఖాముఖి దశ ఆపై అప్పటికి వాదించిన కేసులు వాటి వల్ల సమాజానికి కలిగిన ప్రయోజనం పరిశీలిస్తారు. అన్నింట్లో మంచి స్కోర్ తో నిలిచిన ముగ్గురిని ఎంపిక చేస్తారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో పాటు 15 మంది సభ్యులు ఉన్న ప్యానల్ విజేతలను నిర్ణయిస్తుంది.

ఎక్కువ స్కోరింగ్ వచ్చిన ఆ ముగ్గురిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అందులోనే మన తెలుగు తేజం శ్రీకర్ ఏచూరి 24 ఏళ్ల యువ లాయర్ ఒకరు ఉన్నారు. దీని కింద రెండేళ్ల పాటు నెల 30 వేల ఉపకార వేతనంతో పాటు న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తారు.

ఈ ఫెలోషిప్ 2008లో ప్రారంభమైంది అప్పటినుంచి ఎంపికైన వారిలో అతి చిన్న వయసుకుడిగా శ్రీకర్ రికార్డ్ సృష్టించాడు. ఈసారి మొత్తం 300 మంది పోటీపడ్డారు .

యూనిసెఫ్ తరుపునా: 

న్యావిద్య పూర్తయినటువంటి శ్రీకర్ బార్ ఎక్సమ్ పూర్తి చేసి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రముఖ న్యాయవాది ప్రతి అసోసియేట్లో జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు, రెండున్నర ఏళ్ల కిందటనే సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన శ్రీకర్ అతి చిన్న వయస్సులో ఒకరిగా నిలిచారు,

ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్పొరేట్ సంస్థలు ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు న్యాయ సేవలు అందించాడు. ఒకవైపు వృత్తి కొనసాగిస్తూనే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ తో కూడా కలిసి పని చేశారు. శ్రీకర్ తెలంగాణలో జైల్లో స్థితిగతులు అందులోని ఖైదీల పరిస్థితులపై పరిశోధన చేశాడు.

యంత్రాంగం నీ బంధనలు ఖైదీలను ట్రీ చేసే విధానం వీటన్నిటిని విశ్లేషించి ఖైదీల పరిస్థితి ఎలా మెరుగుపరచవచ్చో తెలియజెప్పేలా పరిశోధక వ్యాసాలు రాశాడు. అవి 2023లో యూనిసె ఫ్ జర్నల్స్ లో వేయబడ్డాయి.

కరోనా సమయంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు కోల్పోతున్న ప్రాథమిక హక్కులపై అధ్యయనం కూడా చేశాడు. ఈ పరిశోధకంశాలు 2021లో రోబ్లిక్ సౌత్ ఏసియా అనే జర్నల్లో వచ్చాయి ఇవి కాకుండా 2024లో ఢిల్లీలోని నేషనల్ యూనివర్సిటీ ఒక సెమిస్టర్ స్పోర్ట్స్ ల కోర్సులు బోధించాడు. శ్రీకర్ బీసీసీఐ సాయి ఫుట్బాల్ ఫెడరేషన్ లాంటి క్రీడా సంస్థలకు ఉండే లీగల్ ఫ్రేమ్ వర్క్ గవర్నమెంట్ నిబంధనలు సంబంధించిన అంశాలు చెప్పేవాడు.

ReplyForwardAdd reaction

Loading