సెప్టెంబర్ 2 వరకు పాస్ పోర్ట్ సేవల నిలిపివేత
సాంకేతిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా కొన్ని రోజులపాటు ఆన్లైన్ పాస్పోర్ట్ సేవలకు స్వల్పంగా అంతరాయం కలగనుంది. గురువారం రాత్రి నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపి వేస్తున్నట్లు తెలిపింది.
ఈ వ్యవధిలో కొత్త అపాయింట్మెంట్లు ఏవి షెడ్యూల్ చేసే వీలు ఉండదని పేర్కొంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని దీనివల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ వివరించింది. మరోవైపు శుక్రవారం అపాయింట్మెంట్లను రీ షెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు సందేశాలు పంపించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం తెలిపింది.