దర్శన టికెట్, ఆధార్ కార్డ్ ఉన్నవారికి శ్రీవారి లడ్డులు

దర్శన టికెట్ ఆధార్ కార్డ్ ఉన్నవారికి శ్రీవారి లడ్డులు

తిరుమలలో అమల్లోకి నూతన విధానం;

శ్రీవారి లడ్డు ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళారులను నియంత్రించేందుకు తీ తీదే చర్యలు చేపట్టింది . దర్శన టికెట్ ఆధార్ కార్డు ఉన్నవారికి లడ్డు ప్రసాదాన్ని అందించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఇకపై శ్రీవారి భక్తులకు దర్శనం టోకెన్ పై ఒక ఉచిత లడ్డు అందిస్తారు. ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డులను రూపాయి 100 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దీంతోపాటు టోకెన్ ఉన్నవారికి మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను నాలుగు నుంచి ఆరు వరకు కొనుక్కొని వెసులుబాటు కల్పిస్తారు.

తిరుమలలో అధిక రద్దీ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోలేక నేను తిరిగే భక్తులు వారి ఆధార్ కార్డు పై రెండు లడ్డులను ఒక్కోడానికి 50 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. లడ్డు కౌంటర్ కు వెళ్లిన భక్తుడి ఆధార్ కార్డు నెంబరు ఆన్లైన్లో నమోదు చేసి ప్రసాదాన్ని అందిస్తారు. వ్యతిరే కేంద్రంలోని రెండో అంతస్తులు 48 నుంచి 62 కౌంటర్లలో ఆధార్ కార్డు ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి నూతన విధానాన్ని అందులో వాటిలోకి తీసుకొచ్చారు.

గుర్తింపు కార్డు దర్శనం టోకెన్లు లేని వారికి లడ్డూలు ఇవ్వరు .గతంలో దళారులు లడ్డూలను అక్రమంగా పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. భక్తులకు మరింత పారదర్శకంగా ప్రసాదాలు దళారుల బెడదను అందం చేసేందుకు ప్రసాదాల విక్రయాల్లో పారదర్శకత్వం తీసుకొచ్చేందుకు తీతిదే చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలు కొన్ని మీడియా ఛానల్లో ప్రసారమవుతున్న వదంతులను భక్తులు నమ్మద్దు. బ్లాక్ మార్కెట్ దళారులను అడ్డుకునేందుకు మాత్రమే విక్రయాల్లో చిన్న మార్పు చేశాం అని ఆలయ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తెలిపారు.

Loading