డాక్టర్ రఘురాముకు అంతర్జాతీయ గౌరవ ఫెలోషిప్ భారత ఉపఖండం నుంచి తొలి వైద్యులు

డాక్టర్ రఘురాముకు అంతర్జాతీయ గౌరవ ఫెలోషిప్ భారత ఉపఖండం నుంచి తొలి వైద్యులు.

ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స నిపుణులు కిమ్స్ ఉషా లక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ కు అరుదైన గౌరవం దక్కింది. సోమవారం ఆయన అంతర్జాతీయ శాస్త్ర చికిత్స సమాఖ్య ఐఎస్ఎస్ గౌరవ ఫెలోషిప్ ను స్వీకరించారు. 122 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ గౌరవ ఫెలోషిప్ నాకు తొలిసారి భారత ఖండం నుంచి డాక్టర్ రఘురాం ఎంపికయ్యారు.

కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న గోల్డెన్ జూబ్లీ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ ప్రారంభ వేడుకల్లో సోమవారం ఆయన మలేషియా లోని డిగ్రీ సెంబిలన్ రాష్ట్ర చీఫ్ రూలర్ చేతుల మీదుగా అంతర్జాతీయ శాస్త్ర చికిత్స సమాఖ్య గౌరవ ఫెలోషిప్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురాం మాట్లాడుతూ అరుదైన ఐఎస్ఎస్ అవార్డు దక్కడం గర్వంగా ఉందన్నారు. దీన్ని తన తల్లికి భారతదేశానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు.

Loading