తల్లి స్వార్జిత ఆస్తి పై పిల్లలకు హక్కులు ఉండవు అని తేల్చి చెప్పిన హైకోర్టు

తల్లి స్వార్జిత ఆస్తి పై పిల్లలకు హక్కులు ఉండవు అని తేల్చి చెప్పిన హైకోర్టు.

తల్లి స్వార్జిత ఆస్తి పై పిల్లలు హక్కులు కోరులేరని ఇష్టమైన వారికి కానుకగా ఇచ్చే అధికారం ఆమెకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. తన తల్లి సుశీల్ అగర్వాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంట్లో మూడోవంతు వాటాను పెద్ద కుమారుడి పేరుతో గిఫ్టు సెటిల్మెంట్ డీడ్ చేయడానికి సమర్థిస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిన్న కుమారుడు బజరంగ్లాల్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

దీనిపై జస్టిస్ మోసమే భట్టాచార్య జస్టిస్ ఎన్జీ ప్రియదర్శినిలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1988లో సుశీల్ శర్మ ఆమె పేరిట ఓ ఇంటిని కొన్నారు. ఆయన మరణాంతరం తల్లి తన ముగ్గురు కొడుకుల పేరుతో కూడా వీలు చేశారు అనంతరం దాన్ని రద్దుచేసి పెద్ద కుమారుడు పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ డీల్ చేశారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిగా ఇంట్లో మూడోవంతు వాట బజరంగ్లాల్ కి ఇవ్వాలని కోరారు.

సుశీలతరం న్యాయవాది వాదనలు వినిపిస్తూ తల్లిదండ్రులు సొంతంగా కొనుగోలు చేసిన ఇంట్లో  కొడుకులకు ఎలాంటి హక్కు ఉండదని తెలిపారు. ఇరుపక్షాల వాదనను విన్న ధర్మ స్పందిస్తూ వీల్డిల్లో కొడుకులు ముగ్గురికి వాటాలు ఇచ్చినప్పుడు తల్లికి హక్కులున్నాయని అంగీకరించి మాత్రం లేవనడం సరిగ్గా కాదనిది స్పష్టమైన హక్కులుంటేనే దావలు వేయాలని ఊహ జనిత అంశాలతో అదృష్టాన్ని పరీక్షించుకునేలా వేయడం తగదని పేర్కొంటూ పిటిషనర్ను కొట్టివేసింది.

ఆస్తి యజమానిగా తల్లి గిఫ్ట్ డిడ్ ఇవ్వడని సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది.స్పష్టమైన హక్కులుంటేనే దావలు వేయాలని ఊహ జనిత అంశాలతో అదృష్టాన్ని పరీక్షించుకునేలా వేయడం తగదని పేర్కొంటూ పిటిషనర్ను కొట్టివేసింది. ఆస్తి యజమానిగా తల్లి గిఫ్ట్ ఇవ్వడని సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది.

Loading