నైపుణ్య విశ్వవిద్యాలయ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి న్యూ జెర్సీలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని విల్లడించారు.
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ భాగ్యస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది.
ఆ వర్సిటీకి పేరు ఉన్న వ్యక్తిని చైర్మన్గా నియమిస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇటీవల ఆనంద్ మహీంద్రా హైదరాబాద్లో సీఎంతో సమావేశమైనప్పటికీ యూనివర్సిటీ విషయమై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్గా వ్యవహరించేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించినట్లు తెలుస్తోంది.