ఇలాంటి స్నేహం వద్దు;
చెడ్డి దోస్తు, స్కూల్ ఫ్రెండ్, కాలేజీ స్నేహాలు అయ్యాక మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది ఆఫీసు సహా ఉద్యోగులతోని అందరితో బాగుండడం మంచిదే కానీ కొన్నిసార్లు కొందరిని దూరం పెట్టాల్సిందే ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వాళ్ళకి నో చెప్పేయాల్సిందే.
- కొత్తగా అప్పుడే సంస్థల్లో చేరిన వాళ్లతో సామాజిక మాధ్యమాల్లో స్నేహం మొదలుపెట్టడం అంత మంచి నిర్ణయం అనిపించుకోదు. వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఎదురు చూడాలి. తనతో ముఖ్యంగా సఖ్యంగా ఉండగలను, గౌరవించి పుచ్చుకోగలరు అని నమ్మకం కలిగితేనే ఫ్రెండ్గా ఓకే చెప్పొచ్చు.
- తప్పులు వెతకడమే మా పని అన్నట్టుగా ఉండే బాస్ మేనేజర్ కి సోషల్ మీడియాలో దూరంగా ఉంటేనే మంచిది. మనసారధాలు వ్యక్తిగత విషయాల గురించి వాళ్లు ఆరా తీయొద్దు అంటే నో బాస్ అనాల్సిందే.
- మన విజయాన్ని కొందరు ఉద్యోగులు తట్టుకోలేరు ఇలా అసూయ ఈర్షపడే పులితో ఆన్లైన్లో స్నేహం చేయకుండా ఉంటేనే మంచిది. మన విజయాలు సంతోషాలను వాళ్ళు ఓరువలేరు కిందికి లాగాలని ప్రయత్నించే వాళ్ళతో ఆన్లైన్ స్నేహం వద్దు.
- శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు మన శత్రువుకి మిత్రుడు మనకు శత్రువు లాంటి వాడే మన వ్యక్తిగత విషయాలు రహస్యాలను మనమంటే నచ్చని వాళ్లకు చేరవేసే ప్రమాదం ఉంది.
- బాస్ మేనేజర్ సన్నిహితులకు సైతం దూరంగా పెట్టడం మరీ మంచిది. మరీ ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళు వ్యక్తిగత విషయాల గురించి మాత్రం పట్టించుకోని వాళ్లను ఏ సామాజిక మాధ్యమాల్లో అనుసరించడం స్నేహితులుగా చేసుకోవడం ఏమాత్రం ఉపయోగం లేని విషయం.