శ్రావణానికి స్వాగతమే అమావాస్య రోజున విశేషమైన దీప పూజ

పవిత్ర శ్రావణ మాసాన్ని స్వాగతించడానికి ఆషాడ మాసం చివరిరోజైనా అమావాస్యనాడు దీప పూజ జరుపుతారు. ఆగస్టు 4న దీని నిర్వహించనున్నారు.దీప పూజ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు పొందడానికి తోడ్పడుతుందని శాస్త్రం చెబుతోంది.

ఈరోజున మహిళలు ఇంట్లో బయట దీపాలు వెలిగిస్తారు. కొందరు దీపాలను నదిలో వదులుతారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు. ఆషాడ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. ఇది పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యే కాలం ఈ శ్రావణంలో మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్న పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు.

ఆషాడమాసంతో సూర్యుడు దక్షిణానికి మరలు తాడు. రాత్రి వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది. చలి చీకటి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారదోలి వెలుగును వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీప పూజ చేస్తారు.శ్రావణ మాసానికి ముందు రోజున అమావాస్య రోజునా దీప పూజ చేయడం వలన చాలా విశేషమైన శుభం కలుగుతుంది.

Loading