విద్యార్థి మిత్రమా గుర్తుపెట్టుకో ఈ ఫలితాలు అద్భుతంగా వచ్చిన, నువ్వు కోరుకున్నట్టు రాకపోయినా నీకు ఇమీడియట్ గా గొప్ప లాభం ఏమీ లేదు. ఈరోజు పరీక్షలో వచ్చే ఫలితాలు ఈ జీవితాన్ని సెట్ చేయలేవు. ఈరోజు వచ్చే ఫలితాల ద్వారానే నీ జీవితం పరిపూర్ణంగా సెట్ అవుతుంది అనేది లేదు. ఎలా వచ్చిన ఫలితాలు నీవే. కాబట్టి మిత్రమా ఆలోచించుకో.
మీ ఫలితాలు నిన్ను నిరాశపరిచిన నువ్వు నిరాశ పడకు. పదో తరగతిలో తక్కువ ఫలితాలు వచ్చిన మామూలు తెలుగు మీడియం లో చదివినటువంటి బుర్ర వెంకటేశం గారు ఈరోజు విద్యాశాఖ చీఫ్ సెక్రటరీగా ఫలితాలను విడుదల చేస్తున్నారు. కాబట్టి ఫలితాలు బాగా లేవని ఆత్మహత్యల జోలికి వెళ్ళకు. నీకు ఏదైనా బాధ అనిపిస్తే నీకు సహాయం చేయడానికి మేమున్నాము.
పరీక్షలు కంటే పరీక్ష ఫలితాలు కంటే జన్మనిచ్చిన అమ్మానాన్నలు వాళ్ళ ఆశలు చాలా గొప్పవి. కాబట్టి అమ్మానాన్నల కోసం నువ్వు బతకాలి. పరీక్ష నిధి ఫలితము నీది జీవితం నీది, కాబట్టి మిత్రమా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఊపిరి ఉన్నంతవరకు ఈ జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాన్నికొస్తూనే ఉంటాయి. విజయోస్తు. విజయోస్తు. విజయోస్తు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉదయం 10 గంటలకు, పదవ తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు తెలిపారు.