నేడు SHAAR 100వ ప్రయోగం:

ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAAR) నుంచి బుధవారం ఉదయం 6: 23 గంటలకు 100 రాకెట్ ప్రయోగం జరగనుంది.GSLV-F15 రాకెట్ ప్రయోగానికి ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున 2: 53 గంటలకు కౌంట్ డౌన్ ఇస్రో షురూ చేసింది.

రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ చరిత్ర ఆత్మక ప్రయోగంలో ఎన్ వి ఎస్ 02 ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి రాకెట్ అంతరిక్షానికి చేర్చాను ఉంది .భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా వి నారాయణ ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి రాకెట్ ప్రయోగం.

ఇది GSLV-15 రాకెట్ పొడవు 50 .9 మీటర్లు ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఇస్రోకు 17వ GSLVమిషన్ , స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ తో కూడిన రాకెట్ను ప్రయోగించడం 11వ సారీ కానుంది.

భారత భూభాగంతో పాటు చుట్టూ 1500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సేవలను అందించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నావిక్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నావిక్ లోకి సెకండ్ జనరేషన్ కు చెందిన 5 అత్యాధునిక NVS 01/02/03/04/04 ఉపగ్రహాలు చేరనున్నాయి. ఇందులో భాగంగా 2023 మే 29న ఎన్ వి ఎస్-01 ఉపగ్రహాన్ని GSLVF-12 మిషన్ ద్వారా ఇస్రో అంతరిక్షానికి చేర్చింది.

తాజాగా ఈ ఉపగ్రహాల కూటమిలోకి రెండో సాటిలైట్ ను ప్రయోగించనుంది ఇక నావిక్ వ్యవస్థ ద్వారా 20 మీటర్ల ఖచ్చితత్వంతో జిపిఎస్ సేవలు అందనున్నాయి.

తొలిసారి దేశీయ అటామిక్ క్లాక్ తో:

NVS -02 ఉపగ్రహం 2,250 కిలోల బరువు ఉంటుంది. దీనిని బెంగళూరులోని యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ రూపొందించింది.

ఇందులో నావిగేషన్ పేలోడ్ ఎస్ సి బ్యాండ్లు ఉంటాయి. భూభాగంతో పాటు సముద్ర తలం పైన నావిగేషన్ సేవలకు ఇది ఉపయోగపడుతుంది.

అలాగే మొబైల్ ఫోన్లలో లొకేషన్ ఆధారిత సేవలకు ఉపగ్రహాలకు కక్షల నిర్ధారణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IOTఎమర్జెన్సీ టైమింగ్ సర్వీస్ లను ఇది అందించనుం.ది అని ఇస్రో ఇస్రో వారు తెలిపారు. మొదటిసారిగా దేశీయంగా తయారు చేసిన అటామిక్ క్లాక్ కూడా ఎన్ వి ఎస్ -02 లో అమర్చడం మరో విశేషంగా మారింది.

Loading