బరువు తగ్గాలా
బరువు తగ్గించే ఆహార పద్ధతిని మొదలుపెట్టాలని అనుకుంటున్నారా, అది పనిచేస్తుందో లేదో అని సందేహిస్తున్నారా, అయితే ఆహారంలో క్యాలరీలు తగ్గించడంతోపాటు ప్రోటీన్ పీచు పదార్థాలు పెంచుకోండి . యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ఇదే విషయాన్ని చెబుతోంది. ఆహార పద్ధతి ఆయవెత్తులకు అనుగుణంగా దీర్ఘకాలం పాటించేలా మార్పులు చేర్పులకు అనుగుణంగానే ఉండాలని సూచిస్తుంది.
ఇందులో ఇండివిజులైజ్ డైట్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం అని కొత్త బరువు తగ్గించే పద్ధతిని ప్రభావాలను పరిశీలించారు. భోజనం చేసేటప్పుడు ప్రతిసారి ఎంత తినాలో సూచించే ప్రత్యేకతలను పరిశోధకులు సృష్టించారు. దీని ఆధారంగా రోజుకు 1500 క్యాలరీల లోపు శక్తినిచ్చే ఆహారం ఇందులో 80 గ్రాముల ప్రోటీన్ 20 గ్రాముల పీచు ఉండేలా ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా ఆహార పద్ధతిని నిర్ణయించుకోవచ్చు .దీన్ని పాటించిన వారిలో ఏడాది తర్వాత శరీర బరువులో 12.9% తగ్గడం గమనార్హం ఎంత ఎక్కువగా ప్రోటీన్ పీచు ఎక్కువగా తీసుకుంటే అధికంగా బరువు తగ్గుతున్నట్లు తేలింది.