అయోధ్య గుడికి విరాళంగా 2100 కోట్ల చెక్కు పెద్ద మెలికపెట్టిన దాత.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఇటీవల అందిన 2100 కోట్ల రూపాయల చెక్కు ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. ఈ చెక్కును పంపిన దాత దానిపై తన పేరు, మొబైల్ నెంబర్, చిరునామా రాశారు. ఇక్కడే పెద్ద మెలిక కూడా పెట్టారు. చెక్కును ప్రధానమంత్రి సహాయ నిధి పేరు మీద ట్రస్టుకు పోస్ట్ ద్వారా పంపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రెండు రోజుల క్రితం ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రస్టు అధికారులు సూచించామన్నారు. ఆలయ ఖాతాలో 2600 కోట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట బ్యాంకు ఖాతాల్లో 2600 కోట్లు ఎఫ్డీ ల రూపంలో ఉన్నట్లు చెంపత్రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తులు శ్రీరామ దర్బార్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.