మన వర్సిటీ ర్యాంకులు ఏటేటా కిందికి దిగజారాయి

మన వర్సిటీల ర్యాంకులు ఏటేటా కిందికి దిగజారాయి.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలు నానాటికి తీసి కట్టుగా తయారయ్యాయి .వాటి జాతీయ ర్యాంకులు పెరగకపోగా ఏ డేటా పడిపోతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థానం ఓవరాల్ యూనివర్సిటీల విభాగంలో మరింత దిగజారింది. అయితే ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో ఓయూ ఆరో స్థానంలో నిలవడం కొంత ఊరట కలిగించే అంశం ఇంజనీరింగ్ విద్యాసంస్థల విభాగంలో జెఎన్టియుహెచ్ ర్యాంకు పడిపోగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐటి హైదరాబాద్ డీమ్డ్ వర్సిటీగా ఉన్న హైదరాబాద్ త్రిబుల్ ఐటీలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి.

ఎన్ఐటి వరంగల్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈసారి ఆ సంస్థ మేనేజ్మెంట్ విభాగంలో మొదటి వంద ర్యాంకుల్లో నిలవడం విశేషం. అదే సమయంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్ సి యు ఓవరాల్ విశ్వవిద్యాలయ విభాగంలో పడిపోయింది. ఫార్మసీ విద్యలో గత రెండేళ్లుగా తొలి స్థానంలో నిలుస్తున్న హైదరాబాద్ హైపర్ ఈసారి రెండుకు పడిపోయింది. కేంద్ర విద్యా శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ 2024 ర్యాంకులను సోమవారం విడుదల చేసింది. వాటిల్లో ఓయూ ఓవరాల్ విభాగంలో 64 నుంచి 70కి వర్సిటీల విభాగంలో 36 నుంచి 43 కు పడిపోయింది.

ఇంజనీరింగ్ విభాగంలో జేఎన్టీయూహెచ్ స్థానంలో 83 నుంచి 88వ స్థానానికి దిగజారింది. కేంద్రం 9 ఏళ్లుగా ర్యాంకింగ్ లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా దీనిపై సమీక్షించలేదు. మరికొన్ని ముఖ్యాంశాలు తొలి 50 పరిశోధన సంస్థల్లో ఐఐటి హైదరాబాద్ 15 హెచ్ సి యూ 28 స్థానాల్లో నిలిచాయి. వైదేవీ భాగంలో తొలి యాభై లో ఉస్మానియా వైద్యకళాశాల 48 స్థానాన్ని దక్కించుకుంది.

దంత వైద్య కళాశాలలో హైదరాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 40 స్థానంలో నిలిచింది. న్యాయవిద్య కళాశాలలో నల్సార్ మూడవ స్థానం దక్కించుకుంది. ఇగ్బాయ్ ముబారవ స్థానాలను పొందాయి. వ్యవసాయ సంబంధిత కళాశాలలో తొలి 40 స్థానాలను ప్రకటించగా జయశంకర్ వర్సిటీ 37వ స్థానంలో నిలిచింది .

ఇన్నోవేషన్ తొలి విభాగంలో తొలి పది విద్యాసంస్థల్లో ఐఐటీ హైదరాబాద్ మూడోస్థానాన్ని సొంతం చేసుకుంది. కళాశాలల విభాగంలో తొలివంధ స్థానాల్లో ఒక కళాశాలకు స్థానం లభించలేదు. ఇంజనీరింగ్ విద్యా సంస్థల విభాగంలో ఓయూ గోకరాజు మహీంద్రా వర్సిటీలు 101 140 పరిధిలో బిఎన్నార్ విజ్ఞాన జ్యోతి అనురాగ్ విజ్ఞాన్ సిబిఐటి సివిఆర్ ఏరోనాటికల్ ఉర్దూ వర్సిటీ వర్ధమాన్ కళాశాలలు 151 నుంచి  200 పరిధిలో నిలిచాయి.

Loading