తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు, మంచి విద్యను అందించే ఉద్దేశంతో, రెసిడెన్షియల్ గురుకుల కాలేజెస్, ఎంట్రన్స్ ఎగ్జామ్ గత నెలలో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. కింద ఉన్న లింకు ద్వారా, మీ హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి, మీ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందులో సీటు వచ్చిన విద్యార్థులు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న ప్రకారం మీకు వచ్చిన కాలేజీలో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవవలసి ఉంటుంది.
ఈ రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఇక్కడ ఉచిత విద్యతోపాటు ఎంసెట్, నీట్ లాంటి పరీక్షలకు కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రతి విద్యార్థి పైన పర్సనల్ కేర్ ఉంటుంది. విద్యార్థికి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఇక్కడ బోధన ఉంటుంది. ఈమధ్య విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రంలో గురుకులాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి.
ఈ గురుకుల లో సీటు వచ్చిందంటే విద్యార్థి తన జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్టే. బాల బాలికలకు సపరేట్ ఉన్న ఈ గురుకులాలలో బాలికలు చదివే కళాశాలలో మహిళా టీచర్లు బోధిస్తారు.
Results links 👇👇👇👇👇
https://tsrjdc.cgg.gov.in/SPRTSRJCAPPL/tsrjcresultspI090524sphrss.results